Friday, 27 November 2015

"భారతదేశం లోని ద్వాదశ జ్యోతిర్లింగాలు "

ఓం నమః శివాయ 



      మన  భారతదేశం లోని శైవక్షేత్రాలు వివిధ రాష్ట్రాలలో వెలువబడ్డాయి . అందులో ప్రసిద్దమైనవి పన్నెండు శివాలయాలు ,పన్నెండు రాష్ట్రాలలో స్వంభువుగా వెలిసినవి అవే "ద్వాదశ జ్యోతిర్లింగాలు ". ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతి సంవత్సరము వచ్చే కార్తీకమాసంలో కాని పరమేశ్వరునికి ప్రీతికరమైన మహాశివరాత్రి రోజున పూజింప బడుతాయి . ప్రతి సంవత్సరము వచ్చే కార్తికపౌర్ణమి నాడు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పరమేశ్వరునికి ఇష్టకరమైన భిల్వాపత్రాలతో కాని విభుదితో కాని అభిషేకము చెస్తారు. ఇప్పుడు వివిధ జ్యోతిర్లింగాల వివరణ గురించి తెలుసుకుందాము. 

1.   సోమనాథ జ్యోతిర్లింగం , సౌరాష్ట్ర , గుజరాత్ 
2.   మల్లికార్జునస్వామి జ్యోతిర్లింగం , శ్రీశైలం , ఆంధ్రప్రదేశ్
3.   మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగం , ఉజ్జయిని , మధ్యప్రదేశ్ 
4.   ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం , ఓంకారేశ్వర్ , మధ్యప్రదేశ్ 
5.   కేదారనాథ్ జ్యోతిర్లింగం , కేదారనాథ్ , ఉత్తరాఖండ్ 
6.   భీమశంకర్ జ్యోతిర్లింగం , పూణే , మహారాష్ట్ర 
7.   కాశీవిశ్వనాథ జ్యోతిర్లింగం , వారణాసి , ఉత్తరప్రదేశ్ 
8.   త్రయంభకేశ్వర్ జ్యోతిర్లింగం , నాసిక్ , మహారాష్ట్ర 
9.   వైద్యనాధ్ జ్యోతిర్లింగం , జార్ఖండ్ , మహారాష్ట్ర 
10. నాగేశ్వర్ జ్యోతిర్లింగం , ద్వారకా , గుజరాత్ 
11. రామేశ్వర్ జ్యోతిర్లింగం , రామేశ్వరం , తమిళనాడు 
12. గ్రిష్నేశ్వర్ జ్యోతిర్లింగం , దౌలతబాద్ , మహారాష్ట్ర